NDL: బనగానపల్లె మండలంలో నందవరం చౌడేశ్వరి మాత శైవ క్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ వేద పండితులతో అమ్మవారిని పసుపు పారాయణంతో సింగారించి పుష్పాలంకరణలలో అలంకరించారు. యాగంటి ఉమామహేశ్వర స్వామి అమ్మవారికి కుంకుమార్చన, పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, మహామంగళహారతి, పూజలు నిర్వహించారు.