యూట్యూబర్, బిగ్బాస్-17 ఫేమ్ అనుగరాగ్ దొభాల్ ఆత్మహత్యా యత్నం చేశాడు. కుటుంబ కలహాలతో మనస్తాపనికి గురైన అతడు 150కి.మీ వేగంతో వెళ్లి కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ప్రమాదం జరిగే సమయంలో దాదాపు 80 వేల మంది ఇన్స్టా లైవ్లో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.