flyer arrested for smoking beedi on Akasa Air flight
flight in Air:విమానాల్లో ప్రయాణించే సమయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరి. దేశీయ విమానాల్లో అయినా సరే.. కచ్చితంగా చెక్ చేసి పంపిస్తారు. బెంగళూరులో ఓ 56 ఏళ్ల వ్యక్తి నిబంధనలను తుంగలో తొక్కాడు. ఆకాశా ఎయిర్ ఫ్లైట్ (flight in Air) గాలిలో ఉండగానే.. బీడీ అంటించాడు. ప్లైట్ కెంపెగౌడ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. డ్యూటీ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తోటి ప్రయాణికులతో ప్రాణాలతో చెలగాటం ఆడారని అతనిపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు (police) అరెస్ట్ చేశారు.
బీడీ కాల్చిన వ్యక్తి రాజస్థాన్ మార్వార్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్‌గా (praveen kumar) గుర్తించారు. అతను అహ్మదాబాద్‌లో విమానం ఎక్కాడని.. టాయిలెట్ వెళ్లి బీడీ తాగాడట. పొగ రావడంతో సిబ్బంది గమనించారు. విమానం కెంపెగౌడ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే అరెస్ట్ చేసి.. బెంగళూర్ సెంట్రల్ జైలుకు తరలించారు.
విమాన ప్రయాణం అతనికి కొత్త అని.. జీవిత కాలంలో ఎప్పుడూ ట్రావెల్ (travel) చేయలేదని తెలిసింది. విమానంలో ప్రయాణించే సమయంలో రూల్స్ గురించి అతనికి తెలియదట. అతను ఎప్పుడూ రైలులో ప్రయాణించేవాడట. రైలులో ట్రావెల్ చేసే సమయంలో టాయిలెట్లో (toilet) స్మోక్ చేసేవారని చెప్పాడు. విమానంలో కూడా అలానే ఉంటుందని భావించానని తెలిపాడు. అందుకోసమే టాయిలెట్ వెళ్లి బీడీ తాగానని చెప్పాడు.
అతను విమానంలో ఎక్కే సమయంలో బీడీలు (BD) ఉన్నాయనే విషయం కనిపెట్టకపోవడం భద్రత వైఫల్యం అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈజీగా కనిపెట్టొచ్చు అని.. దీని వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతాయని తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇద్దరు కూడా ఇలా చేసి అరెస్ట్ అయ్యారు. విమానంలో సిగరెట్ వెలిగించడంతో కటకటలా పాలయ్యారు.