CTR: పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో కాపర్ కేబుల్ వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న 7 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.5.30 లక్షల విలువైన కాపర్ వైర్లు, ల్యాప్టాప్, మొబైల్, బంగారు నగలు, నగదు రూ.1 లక్ష, ఆటో రిక్షా స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు అభినందించారు.