TG: కామారెడ్డి జిల్లా కేంద్రంలో తన ముగ్గురు చిన్నారుల మృతిపై తల్లి షబీనా కన్నీటి పర్యంతమైంది. వారిని చంపిన తన భర్త ఇస్మాయిల్‌ను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. పిల్లలను పెద్దచెరువులో తోసేసి ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చి భోజనం కూడా చేశాడని, ఇలాంటివాడిని వదిలిపెట్టకూడదంటూ ఆవేదన వ్యక్తంచేసింది.