JN: మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు అన్నారు. స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థులను ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా వెంకటేశ్వర్లు సన్మానించారు. నేటి సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, మహిళలకు బీజేపీలో పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.