»21 Days Of Telangana Birth Anniversary Celebrations
Telangana Formation Day: 21 రోజుల పాటు తెలంగాణ అవతరణ దశాబ్ధి వేడుకలు
తెలంగాణ అవతరణ(Telangana Formation Day) దశాబ్ధి వేడుకలు ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్(CM KCR) నిర్ణయించారు. జూన్ 2వ తేది నుంచి 21 రోజుల పాటు వేడుకలు సాగాలన్నారు.
తెలంగాణ అవతరణ(Telangana Formation Day) దశాబ్ధి వేడుకలు ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్(CM KCR) నిర్ణయించారు. జూన్ 2వ తేది నుంచి 21 రోజుల పాటు వేడుకలు సాగాలన్నారు. మొదటిరోజు తెలంగాణ సచివాలయంలో పలు కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అమరవీరులను ఒకరోజు స్మరించుకునేందుకు ప్రత్యేకంగా ‘మార్టియర్స్ డే’ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. గ్రామ గ్రామాన తెలంగాణ అమర వీరులను స్మరిస్తూ నివాళులు అర్పించాలన్నారు.
దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని గురించి ప్రపంచానికి తెలియజేసే కార్యక్రమాలు ఉండాలని అధికారులకు తెలిపారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలియచేసే డాక్యుమెంటరీ(Documentary)ని రూపొందించాలన్నారు. జూన్ 2, 2014 నుంచి 2023 జూన్ 2వ తేది దాకా స్వయం పాలనలో సాగిన సుపరిపాలన గురించి తెలియజేసే మరో డాక్యుమెంటరీని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా 21 రోజుల పాటు తెలంగాణ సంబరాలు(Telangana Formation Day) వేడుకగా సాగాలన్నారు. వంటలు, ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, జానపద తదితర సంగీత విభావరి, సినిమా జానపద తదితర కళాకారులతో ప్రదర్శనలు, సంగీత, నృత్యం, జానపదం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో 5 నుంచి ఆరువేల మంది కళాకారులతో హైదరాబాద్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్(CM KCR) తెలిపారు.