పల్నాడు: వినుకొండ పట్టణం రైలుపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళలు కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ.. మహిళలపై దాడులను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.