JN: జిల్లా పరిపాలనను మరింత వేగవంతం చేసేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 160 మంది పంచాయతీ కార్యదర్శులను ఒకేసారి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరినీ డిప్యూటేషన్ ప్రాతిపదికన వివిధ మండలాలకు కేటాయించారు. బదిలీ అయిన కార్యదర్శులు వెంటనే కొత్త స్థానాల్లో చేరి బాధ్యతలు చేపట్టాలన్నారు.