WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు శేషు ఆలయానికి వచ్చి అమ్మవారిని విశేషంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. నేడు సెలవు దినం కావడంతో ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని..తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.