రాజకీయాలపై నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటానని, అయితే పరిధులు దాటితే మాత్రం స్పందిస్తానని తెలిపాడు. పవన్ కళ్యాణ్‌ను విమర్శించిన వారే ఇప్పుడు ఆయన విజయాన్ని చూస్తున్నారని, అలాగే లోకేష్‌ను ‘పప్పు’ అని వెక్కిరించిన వారే ఇప్పుడు ఆయనలోని ‘నిప్పు’ లాంటి నాయకత్వాన్ని గుర్తిస్తున్నారని శివాజీ పేర్కొన్నాడు.