AP: రాష్ట్రంలోని మహిళలందరికీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం నుంచి మహిళా సాధికారిత ప్రారంభమైంది. ఈనాడు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేసే విధంగా కొనసాగుతోంది. మెగా DSC ద్వారా 7955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. కేంద్రంతో కలిసి మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణకు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టాం’ అని వెల్లడించారు.