MDCL: బోడుప్పల్ 10వ సర్కిల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శానిటేషన్ కార్మికులను ఘనంగా సన్మానించారు. డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఈ.శ్యామ్ సుందర్ రావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.జాహ్నవి శశాంక్ పాల్గొని నగర పరిశుభ్రతకు మహిళా కార్మికులు చేస్తున్న సేవలను అభినందించారు.