SRPT: పెదవీడులో ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ZPHS పాఠశాల ప్రాంగణంలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించి ఆదర్శ గ్రామంగా చేస్తామని తెలిపారు.