SKLM: జిల్లాలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు శనివారం ఆపరేషన్ వజ్ర ప్రహార్ నిర్వహించామని జిల్లా అదనపు ఎస్పీ కెవి రమణ వీడియోకు తెలిపారు. ఈ ఆపరేషన్లో భాగంగా 1030 ఇళ్లలో తనిఖీలు నిర్వహించి, 55 వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.