KRNL: ఆదోనిలో ఆర్పీ మహిళలతో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఒక రోజు ముందే మహిళలతో కలిసి కేక్ కట్ చేసి, సంబరాలు జరుపుకున్నారు. మహిళల పాత్ర సమాజ నిర్మాణంలో అవసరమని, ప్రతి రంగంలో మహిళలు ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.