»Karnataka Elections 2023 Veerashaiva Lingayat Forum Extends Support To Congress In Assembly Elections
Karnatakaలో కాంగ్రెస్ కు గుడ్ న్యూస్.. బీజేపీకి షాక్.. వీర శైవ లింగాయత్ మద్దతు
వీరి మద్దతుతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్ వచ్చింది. అతి పెద్ద సామాజికవర్గం మద్దతు తెలపడంతో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీదే హవా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దూసుకువెళ్తోంది.
కన్నడ సీమలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) విజయం సాధిస్తుందనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. సర్వేలన్నీ (Survey) ఇదే విషయం చెబుతున్నాయి. కమీషన్ ప్రభుత్వంగా (Commission Govt) గుర్తింపు పొందిన అవినీతి బీజేపీని కన్నడ ప్రజలు తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఈ జోష్ తో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) విస్తృత ప్రచారం చేస్తోంది. క్షేత్రస్థాయిలో వెళ్లి బీజేపీ తప్పిదాలు, మోసాలను ప్రజలకు విప్పి చెబుతోంది. ఈ సమయంలోనే హస్తం పార్టీ ఓ శుభవార్త లభించింది. కర్ణాటకలో (Karnataka) అతి పెద్ద సామాజికవర్గం వీరశైవ లింగాయత్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేయాలని పిలుపునిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. వీర శైవ లింగాయత్ (Veerashaiva Lingayat)లు కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం కు వేయాలని పిలుపునిచ్చింది. ఈ నిర్ణయం కాంగ్రెస్ కొండంత బలం ఇచ్చింది.
మొత్తం 224 స్థానాలకు మే 10వ తేదీన ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమ మద్దతు (Support) విషయమై వీర శైవ లింగాయత్ ఫోరం (Veerashaiva Lingayat Forum) ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 17 శాతం వరకు ఉన్న లింగాయత్ ఓటు బ్యాంక్ (Vote Bank) గెలుపోటములను తారుమారు చేస్తుంది. దక్షిణ కర్ణాటకలో అత్యంత ప్రభావం చూపే సామాజిక వర్గం ఇది. వీరు కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు ప్రకటించారు. 2018లో బీజేపీకి మద్దతు తెలిపిన ఈ వర్గం అనంతరం దూరమైంది. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, రాష్ట్రాన్ని అథోగతి పాలు చేయడం వంటి వాటితో కమలం పార్టీని కాలదన్నేసి కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు.
కాగా వీరి మద్దతుతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్ వచ్చింది. అతి పెద్ద సామాజికవర్గం మద్దతు తెలపడంతో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీదే హవా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దూసుకువెళ్తోంది. ఈ ఎన్నికల కోసం చాలా కాలం తర్వాత పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రచారానికి వచ్చారు. రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివ కుమార్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.