GNTR: తెనాలిలోని 19వ వార్డు పరిధిలోని షరాఫ్ బజార్, మాజేటి నాగేశ్వరరావు వీధుల్లో మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు పర్యటించారు. అధికారులతో కలిసి వార్డులో పర్యటించిన ఆయన, నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని ఇంజినీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించి, కాలువల్లో వ్యర్థాలు లేకుండా ఎప్పటికప్పుడు పూడిక తీయించాలని ఆదేశించారు.
Tags :