VZM: విజయనగరంలోని పాత పశువుల మార్కెట్ దగ్గర మంగళ వీధిలో కొలువైవున్న శ్రీ నూకాలమ్మ వారి 68వ వార్షిక జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరమ్మ ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు.