BDK: జూలూరుపాడు మండలం మాచినేనిపేట గ్రామానికి చెందిన నరసింహారావు, నాగేశ్వరరావులు గత కొంతకాలంగా రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకి కొనుగోలు చేసి కోళ్ల ఫారంలో అక్రమంగా నిలువ తీసుకుంటున్నారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీలక్ష్మి రాత్రి సిబ్బందితో కలిసి కోళ్ల ఫారం వద్ద తనిఖీ నిర్వహించారు. 23 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా నిలువ ఉన్నట్లు ఆమె వెల్లడించారు.