ASR: చింతూరు మండలం శబరి నది ఒడ్డున బుధవారం ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు. మృతురాలు చట్టి గ్రామానికి చెందిన లాడి కుమారిగా నిర్ధారించారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో పాటు మతిస్థిమితం లేకుండా సంచరిస్తోందని పేర్కొన్నారు. నది వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెంది ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.