AP: DSCలో అవినీతి జరిగిందంటూ YCP చేస్తున్న ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పందించారు. 150 రోజుల్లో DSC నిర్వహించి టీచర్లకు ఆఫర్ లెటర్లు ఇచ్చామన్నారు. డీఎస్సీని అడ్డుకునేందుకు YCP 200కు పైగా కేసులు పెట్టిందని.. అవన్నీ విఫలం కావడంతో ఇప్పుడు కొత్త డ్రామాలకు తెరలేపిందని విమర్శించారు. YCP కుట్రల విషయంలో AP ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.