KKD: సామర్లకోట బ్రిడ్జిపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఉప్పాడకు చెందిన ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.