KMM: భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లా క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. దేశ ప్రగతికి నెహ్రూ చేసిన సేవలు ఎల్లప్పుడూ చిరస్మరణీయమని విక్రమార్క కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.