సినీ నటుడు, నందమూరి తారకరత్న(Nandamuri Tarakaratna) మరణించిన సంగతి తెలిసిందే. గుండెనొప్పి(Heart attack) రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 23 రోజుల తర్వాత తారకరత్న మరణించారు. బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకున్నప్పటికీ ఫిబ్రవరి 18న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను అభిమానులు నందమూరి కుటుంబం(Nandamuri Family) జీర్ణించుకోలేకపోయారు.
తారకరత్న(Tarakaratna) చనిపోయిన రోజులు గడుస్తున్నప్పటికీ ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) ఇంకా ఆ బాధ నుంచి బయటికి రాలేకపోతున్నారు. తన భర్తను తలచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్(Emotional Posts)లు చేస్తున్నారు. గతంలో తారకరత్న ప్రేమను, అనురాగాన్ని తలచుకుంటూ నోట్ ను షేర్ చేశారు.
తాజాగా తారకరత్న(Tarakaratna)ను తలచుకుని ఆయన భార్య అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) మరో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తారకరత్న ఫోటోను షేర్ చేసి ఈ జీవితానికి సరిపడ గుర్తులను, జ్ఞాపకాలను తారకరత్న పంచి వెళ్లాడని, వాటితోనే తాను జీవితంలో ముందుకు వెళ్తానని తెలిపారు. తన చివరి శ్వాస విడిచే వరకూ తారకరత్నను ప్రేమిస్తూనే ఉంటానని ఎమోషనల్ పోస్టు(Emotional Posts) షేర్ చేశారు. దీంతో ఆ పోస్టు కాస్తా నెట్టింట వైరల్(Viral) అవుతోంది.