MDCL: ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని NSS, ఏకో క్లబ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ప్రిన్సిపాల్ డా.కె.విజయ్ కుమార్ పచ్చదనం, పరిశుభ్రత పై ప్రసంగించారు. 10 రోజుల కార్యాచరణలో మొక్కలు నాటడం, పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు ప్రతిజ్ఞ చేశారు.