TG: సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహశీల్దార్ శ్రావణ్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కరీంనగర్లోని ఆయన ఇంట్లో మెరుపు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.