»Former Satya Pal Malik Said In 2024 Not Narendra Modi A New Person Will Become The Prime Minister
Satya Pal Malik: 2024లో నరేంద్ర మోదీ కాదు..కొత్త వ్యక్తి ప్రధాని అవుతారు
జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(Satya Pal Malik) ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని కాలేరని అన్నారు. అంతేకాదు BJP, RSS భావజాలం, పనితీరు గురించి కూడా ప్రస్తావించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) గురించి జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(Satya Pal Malik) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ ప్రధాని కాలేరని వ్యాఖ్యానించారు. కొత్త వ్యక్తి ఇండియాకు ప్రధాని అవుతారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ది వైర్ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సిద్ధాంతాలు, పనితీరుపై అనేక అంశాలను వెల్లడించారు.
అయితే తాను మాత్రం ఎలాంటి రాజకీయ పదవులు ఆశించడం లేదని పేర్కొన్నారు. కానీ 2024 ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ(BJP)కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని సత్యపాల్ మాలిక్ అన్నారు. మోడీని “రైతు వ్యతిరేకి” అని పేర్కొన్న మాలిక్, వచ్చే ఎన్నికల్లో మోడీ కాదు కొత్త వ్యక్తి భారత ప్రధాని అవుతారని పేర్కొన్నారు. ప్రజల్లో ఆగ్రహం పెరిగిందని తెలిపారు. అంతేకాదు బీజేపీకి నరేంద్ర మోదీ భారంగా మారే రోజు ఎంతో దూరంలో లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు సత్యపాల్ మాలిక్ మేఘాలయ గవర్నర్ గా ఉన్న సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహా ప్రధాని మోదీ(modi)కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సహా వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనకు మద్దతు తెలపడం వంటివి వెలుగులోకి వచ్చాయి.