ATP: విడపనకల్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు లేకపోవడంతో రోగులు, వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించి మంత్రి పయ్యావుల సోదరుల సహకారంతో టీడీపీ నాయకులు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డు ఏర్పాటుతో ఆసుపత్రికి వచ్చే రోగులు, గర్భిణులు, వైద్య సిబ్బందికి ఉపశమనం కలిగిందని స్థానికులు తెలిపారు.