కోనసీమ: ఆలమూరు మండలంలోని రైస్ మిల్లులకు తరలిస్తూ పట్టుబడుతున్న వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా అయిదు టన్నుల రేషన్ బియ్యం లోడుతో వెళ్తున్న వ్యాన్ను శుక్రవారం రాజమహేంద్రవరం విజిలెన్స్ అధికారులు జొన్నాడ సెంటర్లో పట్టుకున్నారు. దానిని ఆలమూరు పోలీసులకు అప్పగించారు. దీనిపై మండల సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు