TG: హైదరాబాద్లో చెరువులు క్రమంగా సుందరంగా మారుతున్నాయి. ఇన్ని రోజులు చెరువులు అంటే మురుగుకూపాలే అన్న భావన ప్రజల్లో మారుతోంది. అటువైపు వెళ్తే దుర్వాసన భరించలేమన్న రోజులు పోయి ఓ పదినిమిషాలు అక్కడ ఆగి చల్లనిగాలులు ఆస్వాదించాలనేలా అవి రూపుమార్చుకుంటున్నాయి. కాలుష్యంతో నిండిపోయిన తటాకాలను హైడ్రా తీర్చిదిద్దుతోంది. కబ్జాలపాలైన ఎకరాల కొద్దీ చెరువుల భూములను చెరవిడిపిస్తోంది.