నటి, యాంకర్ విష్ణు ప్రియ(Vishnu Priya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పలు రకాల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో తన కంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు ఇటీవల ఈ అమ్మడు గంగులు అనే పాటకు డాన్స్ చేసి ఫేమస్ అయ్యింది. ఈ పాటలో బిగ్ బాస్ ఫేమ్ మానస్ తో కలిసి స్టెప్పులేసింది. సుధీర్ సుధీర్ తో పోవే పోరా సినిమా చేసి యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది విష్ణు ప్రియ. ప్రస్తుతం కొన్ని షోలు, ప్రత్యేక కార్యక్రమాల్లో మాత్రమే కనిపించే విష్ణు ప్రియ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయాలు పంచుకుంది.
అంతేకాదు తన క్రష్(crush) ఎవరో కూడా చెప్పేసింది. బొంబాయి ప్రియుడు మూవీ హీరో జేడీ చక్రవర్తి(jd chakravarthy) తన క్రష్ అని వెల్లడించింది. అతనితో ప్రేమలో పడినట్లు తెలిపింది. జేడీతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేసిన క్రమంలో అతనిపై మనసు పారేసుకున్నట్లు చెప్పింది. షూటింగ్లో భాగంగా 10 రోజులు మంగుళూరు వెళ్లిన క్రమంలో జేడీ నచ్చాడని తన మనసులో మాట చెప్పగా ఆయన స్పందించలేదని వెల్లడించింది. అంతేకాదు ఇప్పటికీ చక్రవర్తి ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానని ఈ అమ్మడు చెబుతోంది. ఈ అమ్మడు చేప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా(socil media)లో హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు జేడీ చక్రవర్తికి 2016లోనే నటి అనుకృతితో వివాహం జరిగింది.
మరోవైపు ఇదివరకు విష్ణు ప్రియ అఖిల్(akhil akkineni) పై చాలా సార్లు తన ప్రేమను చాటుకుంది. ఏదైనా అవకాశం వస్తే అఖిల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించింది. అంతేకాదు అఖిల్‌తో ఒక్క ఛాన్స్ కావాలని దర్శకులను రిక్వెస్ట్ చేసింది కూడా ఈ యువతి. అఖిల్‌తో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం వస్తే తన జీవితం ధన్యమైనట్లే అని చాలా సార్లు చెప్పుకొచ్చింది.