Condoms : కండోమ్స్ గురించి ఈ విషయాలు మర్చిపోయారో.. అంతే సంగతులు
కండోమ్స్ వాడకం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. లైంగికంగా సంక్రమించే వ్యాధులను రాకుండా చేస్తాయి. ఇవి గర్భధారణను నివారిస్తాయి. అయితే చాలా మంది పురుషులు కండోమ్స్ విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దీనివల్ల వారు పలు సమస్యలను ఎదుర్కొంటారు.
Condoms : లైంగిక వ్యాధుల నివారణకు, గర్భధారణను నివారించడానికి కండోమ్‌లు ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఈ కండోములను ఎలా ఉపయోగించాలో తమకు చాలా బాగా తెలుసని వారు భావిస్తుంటారు. నిజానికి చాలా మందికి కండోములను ఉపయోగించే విధానం తెలియదని నిపుణులు అంటున్నారు. ఈ తప్పుల వల్లే అవాంఛిత గర్భధారణ అవకాశాలు పెరుగుతున్నాయి. అంతేకాదు ఎన్నో రకాల బ్యాక్టీరియా, వైరస్ లు వ్యాప్తిచెందుతున్నాయి. కండోమ్ ఉపయోగించేటప్పుడు మగాళ్లు చేసే కొన్ని తప్పులు..
ఎక్స్పైరీ డేట్ చెక్ చేయకపోవడం
ప్రతి వస్తువుకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే కండోమ్స్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. దీనిని చాలామంది పట్టించుకోరు. కండోమ్‌లు కూడా గడువు తీరితే దెబ్బతింటాయి. ప్రతి కండోమ్ కు గడువు తేదీ ఉంటుంది. ఈ తేదీని చూడకుండా మగవాళ్లు కండోమ్ లను ఉపయోగిస్తారు. అందుకే ఆ సమయంలో అవి చిరిగిపోయి గర్భధారణ అవకాశాలను పెంచుతాయి. అలాగే మీకు ఎన్నో అంటువ్యాధులు వస్తాయి. అందుకే మీరు కండోమ్ లను కొనడానికి ముందు దాని ఎక్స్పైరీ డేట్ ను చెక్ చేయండి. కుప్పల కొద్ది కండోమ్స్ కొనుక్కొని దాచుకోకండి.
వాడిన దాన్నే మళ్లీ వాడడం
కొంతమంది పురుషులు ఉపయోగించిన కండోమ్‌లను తిరిగి ఉయోగిస్తుంటారు. ఇది అంత మంచిది కాదు. కండోమ్స్ ను ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. ఒకేదాన్ని ఎక్కువ సార్లు ఉపయోగించడం వల్ల అది దెబ్బతింటుంది. చిరిగిపోతుంది.
పరిమాణం ముఖ్యం
కండోమ్‌లు చాలా పరిమాణాలలో ఉంటాయి. బిగుతుగా లేదా చాలా వదులుగా ఉండే కండోమ్ ధరించడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఇది గర్భవతి అయ్యే లేదా వైరస్‌లకు గురయ్యే అవకాశాలను పెంచుతుంది. ఎందుకంటే చాలాచాలా బిగుతుగా ఉన్న కండోమ్ ను ధరిస్తే అది చిరిగిపోతుంది లేదా దెబ్బతింటుంది. అలాగే చాలా వదులుగా ఉండే కండోమ్ సులభంగా జారిపోతుంది.
కండోమ్ లను త్వరగా ధరించడం
పురుషులు కండోమ్ ను ఎప్పుడు ధరించాలో సరిగా తెలుసుకోవాలి. సెక్స్ కు ముందు పురుషాంగం స్ట్రెయిట్ గా ఉన్నప్పుడే కండోమ్ ను ధరించాలి. అలా కాకుండా లేట్ గా వీటిని ధరించకూడదు. మీరు అంగస్తంభనకు చేరుకునే ముందు దీన్ని ధరిస్తే.. మీరు దానిని సరిగ్గా ధరించే అవకాశం ఉంది. ఇది మీ ఎస్టీఐల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. గర్భధారణ అవకాశాలను కూడా పెంచుతుంది
తీసేందుకు ఎక్కువ సమయం
స్ఖలనం తర్వాత వీలైనంత త్వరగా కండోమ్ ను తొలగించాలి. అది ఒలికిపోకుండా ఉండాలనుకుంటే ఇలా చేయాల్సిందే. పురుషులు సాధారణంగా స్ఖలనం చేసిన వెంటనే అంగస్తంభన కోల్పోతారు. ఇది కండోమ్ జారి వీర్యం బయటకు రావడానికి దారితీస్తుంది. దానిని నివారించడానికి స్ఖలనం వెంటనే కండోమ్ ను తొలగించాలి. అంగస్తంభన కోల్పోయే ముందు కండోమ్ బేస్ ను పురుషాంగంపై ఉంచి రెండింటినీ బయటకు లాగండి.