AKP: బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టాలని కోటవురట్ల డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు విజ్ఞప్తి చేశారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కోటవురట్లలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కూర్మారావు మాట్లాడుతూ.. ప్రజలు ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలన్నారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి సంపద కేంద్రాలకు తరలించాలన్నారు.