హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) కొత్త కమిటీపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో సీఐడీ అధికారులు ప్రాథమిక విచారణను ప్రారంభించారు. HCA కొత్త కమిటీపై నిధుల దుర్వినియోగంతో పాటు పలు అక్రమాలకు కూడా పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. CID విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.