SKLM: సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు రాము సివిల్స్ పరీక్షల్లో ప్రతిభ చాటుతూ ఆల్ ఇండియా స్థాయిలో 463వ ర్యాంకు సాధించారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన రామును తల్లి లక్ష్మి వ్యవసాయ పనులు చేస్తూ చదివించారు. జి.సిగడాం ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదివిన ఆయన, వరంగల్ నిట్లో ఐఐటీ పూర్తి చేశారు.