BDK: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమావేశంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిన్న పాల్గొని మాట్లాడారు. అర్హులకు రద్దు చేసిన ఇళ్లు కేటాయించాలని, జిల్లాలో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను కేటాయించే సమయంలో అర్హులు అధికంగా ఉన్న పక్షంలో లాటరీ పద్ధతి అనుసరించాలని సూచించారు.