TG: HYD నాచారం పరిధి మల్లాపూర్లో జేపీ వైన్ షాపులో బీరు కొనుగోలు చేసిన మద్యం ప్రియుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. బీర్ బాటిల్లో చేప పిల్ల కదలాడుతుండడంతో చూసిన కస్టమర్ అవాక్కయ్యాడు. దీంతో మద్యం షాపు నిర్వాహకులను ప్రశ్నించారు. తమ దగ్గర తయారు కాలేదని, కేవలం అమ్మడం మాత్రమే చేస్తున్నామని.. కింగ్ ఫిషర్ పరిశ్రమను ప్రశ్నించాలని వైన్స్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.