కృష్ణా జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగాయి. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు నమోదుకాలేదని జిల్లా పరీక్షల అధికారి ఎస్. సరళకుమారి తెలిపారు. జిల్లాలోని 63 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 8,745 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, 8,600 మంది హాజరయ్యారని, 145 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు.