NDL: డోన్ మండలం కొత్తబురుజులో ఈనెల 9న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని శుక్రవారం అధికారులకు కలెక్టర్ రాజకుమారి ఆదేశాలు జారీ చేశారు. రహదారుల వెంట చెత్త కుప్పలు, ప్లాస్టిక్ కవర్లు, మద్యం సీసాలు కనిపించకుండా చూడాలని సూచించారు. డాగ్ స్క్వాగ్ బృందం హెలిఫ్యాడ్, సీఎం పర్యటించనున్న స్థలాలను పరిశీలించారు.