RR: యాసంగి సాగుకు అవసరమైన యూరియా బస్తాలను ఇవాళ పంపిణీ చేయనున్నట్లు MAO ఒక ప్రకటనలో తెలిపింది. కందుకూరు మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద ఉదయం 10 గంటలకు పంపిణీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రైతులు ముందుగా ఫెర్టిలైజర్ యాప్లో బుక్ చేసుకోవాలని, పంపిణీ సమయంలో పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.