»Karnataka Elections 2023 Bjp Manifesto Promises Free Milk And Gas Cylinders In Karnataka
Modi ప్రకటనకు విరుద్ధంగా బీజేపీ మ్యానిఫెస్టో.. ఉచితాలే ఉచితాలే
అవినీతి ప్రభుత్వంగా ముద్రపడిన బీజేపీ పాలనపై ప్రజల్లో ఆగ్రహం తీవ్రంగా ఉంది. ఎన్నికల సరళిని చూస్తుంటే బీజేపీ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. అయితే గెలిచేందుకు ప్రజలను ఆకట్టుకునే పనిలో ఈ ఉచిత తాయిలాల ప్రకటన కాషాయ పార్టీ విడుదల చేసింది.
పార్టీ నాయకుడు ఒక మాట మాట్లాడతాడు.. కానీ పార్టీ మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఉచితాలు వద్దంటూ ప్రధాని మోదీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటనలు చేస్తారు.. కానీ వాళ్లు మాత్రం అవే ఉచిత పథకాలు (Free Schemes) అమలు చేస్తున్నారు. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రధాని ప్రకటనకు విరుద్ధంగా ఆ పార్టీ మేనిఫేస్టోలో అనేక ఉచిత పథకాల హామీలు ఇచ్చింది. మే 10వ తేదీన జరుగనున్న ఎన్నికల కోసం కమలం పార్టీ సోమవారం మేనిఫెస్టో (Manifesto) విడుదల చేసింది. ఉచిత సిలిండర్లు (Gas Cylinders), పాలు (Milk) వంటి ప్రకటనలు గుమ్మరించింది.
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), సీఎం బసవరాజు బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, కేంద్ర మాజీ మంత్రి సదానంద గౌడతో కలిసి ‘ప్రజా ప్రణాళిక’ పేరిట ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ ప్రకటనల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు, నందిని పాలు ఉచితంగా ఇస్తామని కాషాయ పార్టీ ప్రకటించింది. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం, సంక్షేమం అందించడమే తమ విజన్ అని నడ్డా తెలిపారు. మేనిఫెస్టోలో పలు వివాదాస్పద నిర్ణయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఉమ్మడి పౌరస్మృతి ఒకటి. మరోసారి అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించింది.
కాగా అవినీతి ప్రభుత్వంగా (Commission Govt) ముద్రపడిన బీజేపీ పాలనపై ప్రజల్లో ఆగ్రహం తీవ్రంగా ఉంది. ఎన్నికల సరళిని చూస్తుంటే బీజేపీ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. అయితే గెలిచేందుకు ప్రజలను ఆకట్టుకునే పనిలో ఈ ఉచిత తాయిలాల ప్రకటన కాషాయ పార్టీ విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో ఉద్యోగాల విషయమై కొత్తగా తయారీరంగంలో 10 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. తెలంగాణలో మాదిరి మధ్యాహ్న భోజనం మాదిరి అటల్ ఆహార్ కేంద్రాలు, 10 లక్షల ఇళ్ల స్థలాలు వంటివి మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొంది. మేనిఫెస్టోలో ఉన్న హామీలు ఇవే..
– దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు రోజు ఉచితంగా అర లీటర్ నందిని పాలు (Nandini Milk).
– దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు. అది కూడా ఉగాది, వినాయక చవితి, దీపావళికి ఒకటి చొప్పున కేటాయిస్తామని ప్రకటన.
– మైసూరులోని ఫిల్మ్ సిటీకి దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ (Puneeth Raj Kumar) నామకరణం.
– రూ.1,500 కోట్లతో పర్యాటక రంగ అభివృద్ధి
– ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఫిక్స్ డ్ డిపాజిట్, వృద్ధులకు ఉచితంగా వార్షిక ఆరోగ్య పరీక్షలు.
ಅನ್ನ, ಅಭಯ, ಅಕ್ಷರ, ಆರೋಗ್ಯ, ಅಭಿವೃದ್ಧಿ, ಆದಾಯದ ಭರವಸೆಯ ಬಿಜೆಪಿ ಪ್ರಜಾ ಪ್ರಣಾಳಿಕೆ 2023 ಇಂದು ರಾಷ್ಟ್ರೀಯ ಅಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ @JPNadda ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ರಾಜ್ಯ ನಾಯಕರ ಉಪಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬಿಡುಗಡೆಗೊಂಡಿತು.