WG: కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 9న ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంకెం సీతారాం తెలిపారు. ఉపాధి హామీ పథకం అమలుపై ప్రజలతో చర్చించేందుకు ఆమె వస్తున్నట్లు సీనియర్ నాయకుడు కేవీఆర్ నాయుడు పేర్కొన్నారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.