WG: నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శుక్రవారం నిర్వహించిన మున్సిపల్ మార్కెట్ బహిరంగ వేలం పాట వాయిదా పడింది. వేలంలో పాల్గొనేందుకు పాటదారులు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో రెవెన్యూ ఆఫీసర్ మురళి ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో, ఆర్వో అధ్యక్షతన ఈ వేలం ప్రక్రియ జరిగింది. త్వరలోనే వేలం తదుపరి తేదీని ప్రకటిస్తామన్నారు.