TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం రెండోరోజు కొనసాగుతోంది. నిన్నటి నుంచి జూన్ 12 వరకు మొత్తం 99 రోజులు.. శాఖల వారీగా పనులను పూర్తి చేయనున్నారు. గ్రామ కార్యదర్శి నుంచి కలెక్టర్ వరకు అన్ని శాఖల అధికారులతో పాటు సర్పంచులు, వార్డు మెంబర్లు, మున్సిపల్ మేయర్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొననున్నారు.