GNTR: అమరావతిలో శుక్రవారం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సమస్యల గురించి ఆయన సీఎంకు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.