ఏలూరు: వన్ టౌన్ పోలీసులు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను శుక్రవారం పట్టుకున్నారు. బావిశెట్టివారిపేట, తూర్పు వీధి ప్రాంతాల్లో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి బియ్యాన్ని సేకరిస్తున్నారన్న సమాచారంతో నిఘా పెట్టి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1,470 కేజీల రేషన్ బియ్యంతో పాటు రవాణాకు ఉపయోగిస్తున్న ఆటోను సీజ్ చేశారు.