సత్యసాయి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో 3,000 మందితో బహిరంగ సభ, మహిళా వ్యాపారవేత్తల ఉత్పత్తులతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో 500 మంది మహిళలతో సమావేశాలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అంజేయాలని అన్నారు.