MBNR: మహబూబ్నగర్ పట్టణంలోని జామియా మసీదులో నిన్న ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, అనంతరం వారితో కలిసి ఉపవాస దీక్షలను విరమించారు. రంజాన్ పవిత్రతను చాటుతూ ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.