ADB: విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్లో రూ.4.90 కోట్లతో నిర్మించిన సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల భవనాన్ని ప్రారంభించారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా గురుకులాలను బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.